సింబా (హిందీ) రణ్‌వీర్‌ సింగ్‌, సారా అలీ ఖాన్‌ simmba hindi movie review


రివ్యూ: సింబా

సినిమా పేరు: సింబా (హిందీ)

నటీనటులు:
రణ్‌వీర్‌ సింగ్‌, సారా అలీ ఖాన్‌, ప్రకాశ్‌ రాజ్‌, అజయ్‌ దేవగణ్‌, సోనూ సూద్‌, వైదేహి పరశురామి తదితరులు

సంగీతం: తనిష్క్‌ బాగ్చి

కూర్పు: బంటీ నాగి

సినిమాటోగ్రఫీ: జొమోన్‌ టి. జాన్‌

నిర్మాణ సంస్థ: ధర్మ ప్రొడక్షన్స్‌

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రోహిత్‌ శెట్టి

విడుదల తేదీ: 28-12-2018



బాలీవుడ్‌లో దూకుడు మీదున్న కథానాయకుడు రణ్‌వీర్‌ సింగ్‌. అలాంటి ఎనర్జిటిక్‌ స్టార్‌ హీరోతో ‘సింబా’ లాంటి సినిమా చేస్తే తప్పకుండా ఆడుతుందన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంటుంది. అదీకాకుండా తెలుగులో ఎన్టీఆర్‌ నటించిన ‘టెంపర్‌’ సినిమాకు ఇది రీమేక్‌. అందులోనూ రోహిత్‌ శెట్టి దర్శకుడు అనగానే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి ‘సింబా’ ఎలా ఉన్నాడు? ‘టెంపర్‌’లాగే ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందా? చూద్దాం.

కథేంటంటే: సంగ్రామ్‌ భాలేరావ్‌ అలియాస్‌ సింబా (రణ్‌వీర్‌) ఓ అవినీతి పోలీసు అధికారి. డబ్బులు తీసుకుని అక్రమాలకు పాల్పడుతుంటాడు. పోలీసు ఉద్యోగంలోకి వచ్చింది డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతోనే అంటుంటాడు. ఈ నేపథ్యంలో అతనికి షగున్‌ (సారా అలీ ఖాన్‌) పరిచయం అవుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. షగున్‌తో పాటు ఆకృతి (వైదేహి పరశురామి) అనే వైద్య విద్యార్థినితో కూడా సింబాకు స్నేహం ఏర్పడుతుంది. ఆమె చదువుకుంటూనే మరోపక్క పేద పిల్లలకు చదువు చెప్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తన వద్ద చదువుకునే పిల్లలకు దుర్వా(సోనూసూద్‌) సోదరులు మాదకద్రవ్యాలు అలవాటు చేస్తున్నట్లు ఆకృతికి తెలుస్తుంది. వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించడానికి ఆకృతి పబ్‌కి వెళుతుంది. తమ గురించి వివరాలు సేకరిస్తోందని తెలిసి దుర్వా సోదరులు ఆమెను కిడ్నాప్‌ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? సింబా ఆమెను కాపాడాడా? తదితర విషయాలు తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే: ‘సింబా’ చిత్రం ‘టెంపర్‌’కు రీమేక్‌ అనగానే కేవలం పోరాట సన్నివేశాలను మాత్రమే రీమేక్‌ చేశామని గతంలో రోహిత్‌ శెట్టి వెల్లడించారు. కానీ సినిమా చూస్తున్నంతసేపు ‘టెంపర్’ చిత్రాన్ని చూస్తున్నట్లే ఉంటుంది. అక్కడక్కడా చిన్న మార్పులు చేసినప్పటికీ కథలో మాత్రం ఏ మార్పూ కనిపించదు. సినిమాలో రోహిత్‌ శెట్టి మార్క్‌ కనపడింది. కొన్ని చోట్ల సల్మాన్ నటించిన ‘దబాంగ్’ ఛాయలు కూడా కనిపించాయి. అయితే కొన్ని చోట్ల సీరియస్‌గా పోరాట సన్నివేశాలు జరుగుతుంటే అందులోనూ కామెడీని జోడించాలనుకున్నారు రోహిత్‌. పోరాట సన్నివేశాల మధ్యలో పాటలు, డ్యాన్స్‌లతో కూడిన సన్నివేశాలు రావడంతో లాజిక్‌ మిస్సవుతుంది. నిర్మాణ విలువలు ధర్మ ప్రొడక్షన్స్‌కు తగ్గట్టు రిచ్‌గా ఉన్నాయి. పాటలు కూడా వినసొంపుగా ఉన్నాయి.

ఎవరెలా చేశారంటే: ఇది రణ్‌వీర్‌ వన్‌ మ్యాన్‌ షో. అవసరమైన చోట్ల హీరోయిజాన్ని, కామెడీని బాగా పండించాడు. వచ్చీ రాని ఆంగ్లంలో రణ్‌వీర్‌ చెప్పే డైలాగులు నవ్వులు తెప్పిస్తాయి. సారా అలీ ఖాన్‌ అందంగా కనిపించారు. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. పాటల వరకే పరిమితం అయ్యారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ పోలీసుగా అతిథి పాత్రలో నటించారు. అక్షయ్‌ కుమార్, తుషార్ ‌కపూర్‌, కునాల్‌ ఖేము, శ్రేయాస్‌ తల్పాడే, అర్షద్‌ వార్సి, కరణ్‌ జోహార్‌ ఓ పాటలో కనిపించి కాసేపు అలరిస్తారు. ప్రకాశ్‌రాజ్‌, సోనూ సూద్‌, వైదేహి తదితరులు తమ పాత్రల మేర చక్కగానే నటించారు.

బలాలు:

+ రణ్‌వీర్‌ సింగ్‌

+ అజయ్‌ దేవగణ్‌ కేమియో

+ పాటలు

+ నిర్మాణ విలువలు

బలహీనతలు:

- తెలిసిన కథ

- అక్కడక్కడా లాజిక్‌ మిస్సవడం

చివరగా: ‘సింబా’..ఓ ఫన్నీ పోలీసు కథ.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!



#simmba #simba #ranvir #ranvirsingh #simbamovie #simmbamovie #sara #sarah #sarahlikhan #saraalikhan #bollywoodmovie #simmbasongs #simmbareview #simmbastory
#simmbafullmovie  #dharamaproductions #simmbashowtime #simmbamovietickets #simmbaonline #simmbamoviedownload #simmbawatchnow #simmbacast #simmbaboxoffice  #simmbacollections  #badrinath #simmbapics #simmbaimages #simmbavideo  #simmbacollections #simbasongs c

Comments

Popular posts from this blog

Review: Simba hindi movie ranvir singh,sarah ali khan